ప్రకృతికి దూరంగా బ్రతకొద్దు చస్తారు.. పూరీ షాకింగ్ కామెంట్స్

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ లో టాప్ లో ఉండే డైరెక్టర్ లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఆయన సినిమా తీస్తే చాలు ప్రేక్షకులు సైతం ఎగబడేవారు. ఆయనతో కలిసి సినిమా చేయాలని చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్ లు ఎదురుచూసే వాళ్లు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టిని లివింగ్ థింగ్స్ అనే అంశంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. మానవుల శరీరంలో కంటికి కనిపించని ఎన్నో జీవాలు బతుకుతూ ఉంటాయని తెలిపారు. వాటిని మైక్రోబ్స్ అంటారని అన్నారు. అవి మనతోనే ఉంటాయని.. మనపైన బతుకుతాయని తెలిపారు. అయితే మానవ శరీరం అనేది ఎన్నో జీవరాశులకు ఇల్లు లాంటిది అని స్పష్టం చేశారు. ఈ జీవరాశులు మన నోటిపై, ముక్కుపై, కళ్లు, చర్మం, జుట్టు, పొట్టలపై ఎక్కడ పడితే అక్కడ బతుకుతాయని చెప్పుకొచ్చారు.


కానీ ఆ విషయం మనకు తెలియదని, ఎందుకంటే అవి మనకు కనిపించవు కాబట్టి అని స్పష్టం చేశారు. నిజంగా చెప్పాలంటే ఆ జీవరాశులే మన ఫ్యామిలీ మెంబర్స్.. వాడిని మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తప్ప మనకు కనిపించవు అని అన్నారు. ఒకవేళ గనుక మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మన మతి పోవాల్సిందేనని తెలిపారు. ఆ జీవరాశుల వల్లే మనిషి ఆరోగ్యంగా బ్రతుకుతున్నాడని స్పష్టం చేశారు. ఎందుకంటే జీవరాశులే మనిషి బ్రతకడానికి అవసరమైనవన్నీ సమకూర్చుతాయని వెల్లడించారు.

 
పల్లెటూర్ లో బతికే వాళ్ళకి ఈ మైక్రోబ్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. వాటితో కలిసి హ్యాపీగా ఉంటారని ఆయన అన్నారు. కానీ పట్టణాల్లో మాత్రం పరిశుభ్రత కోసం మనుషులు పదే పదే చేతులు కడుగుతూ ఉంటారని తెలిపారు. అలా శుభ్రత కోసం శానిటైజర్ వాడటం, డిస్టిల్డ్ వాటర్ తాగడం వల్ల మైక్రోబ్స్ దూరం అవుతాయని.. దాంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని వెల్లడించారు. మనుషులు ప్రకృతితో కలిసి బతకాలని స్పష్టం చేశారు. కుక్కలు, కోళ్లు, ఆవులు, గొర్రెలు, గుర్రాలతో కలిసి ఉండటం వల్ల మైక్రోబ్స్ బలోపేతంగా మారుతాయని అన్నారు.  మనం కూడా బలంగా ఉండాలంటే అతి పరిశుభ్రత పాటించకపోవడం మేలని తెలిపారు.  జనరేషన్ లు పెరుగుతున్నకొద్దీ మనుషులు బలహీనంగా తయారవుతున్నారని అన్నారు. శానిటైజర్ లు, టిష్యులు వాడే బ్యాచ్ ఎక్కువ కాలం ఉండదని అన్నారు. బలంగా ఉండాలంటే పల్లెటూరు వాళ్ళలా బతకాలని తెలిపారు.  వీలైతే ఇంట్లో ఓ కుక్కపిల్లను పెంచుకోండి..  మీ పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వండి, వర్షంలో తడవనివ్వండని సూచనలు ఇచ్చారు. ప్రకృతికి దూరంగా బ్రతకొద్దు.. చస్తారు అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: