తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో తాజాగా భైరవం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా మే 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాలో మంచి గుర్తింపు కలిగిన ముగ్గురు హీరోలు నటిస్తూ ఉండడం , ఈ మూవీ యొక్క ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డ కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ మూవీ కి ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ ఎంత టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతోంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 2.5 కోట్లు , ఆంధ్ర లో 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని ఈ మూవీ కి 2.2 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి 18.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 19 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగనుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.