పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్గా ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఏ ఏం రత్నం నిర్మాతగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అనేక కారణాల వల్ల అనేక సార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దానితో పవన్ కళ్యాణ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యాక భీమ్లా నాయక్ , బ్రో సినిమాల షూటింగ్లలో పాల్గొని , ఆ మూవీలను పూర్తి చేసి ఆ సినిమాలను కూడా విడుదల చేశాడు.
ఓ వైపు క్రిష్ జాగర్లమూడి కూడా కొండపొలం అనే సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేసి ఆ మూవీని కూడా విడుదల చేశాడు. ఈ మూవీ షూటింగ్ చాలా డిలే అవుతూ రావడంతో క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను ఈ మూవీ మేకర్స్ అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఈ సినిమా యొక్క కేరళ హక్కులను అమివేసినట్లు , దానిని ఓ స్టార్ హీరో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో క్రేజ్ కలిగిన నటులను ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ ఈ మూవీ యొక్క కేరళ హక్కులను కొనుగోలు చేసినట్లు , ఆయన కేరళలో ఈ సినిమాలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.