రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తీస్తున్న కింగ్ డమ్ మూవీ జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బొర్సె నటించింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అయితే కింగ్ డమ్ సినిమా ఆర్ఆర్ పనులన్నీ పూర్తయ్యాయట. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాను రిలీజ్ కి ముందే చూశాడు. ఇక ఈ మూవీ ఫస్ట్ రివ్యూని కూడా ఇచ్చేశాడు. అనిరుధ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ట్వీట్ వేశాడు.
అందులో 'నేను కింగ్ డమ్ సినిమాను చూశాను. కింగ్ డమ్ సినిమా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. అందరూ సినిమాను చూసేందుకు వేచి ఉండండి' అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ అనిరుధ్ సినిమాపై అంచనాలు మరింత పెంచాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ థియేటర్ లో చూసేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మూవీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలిసిందే. ఈ సినిమాను నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో విజయ్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వగా.. తమిళం లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు స్టార్ హీరోలు వాయిస్ ఇవ్వడంతో ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల అయ్యిందో.. లేదో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ కు 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అలాగే డైలాగ్స్ ఉంటాయని మూవీ మేకర్స్ తెలిపారు. టీజర్ చూడగానే విజయ్ అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.