నీకు మానవత్వం ఉందా.. ఆ వైసీపీ నేతకు దిమ్మతిరిగే షాకిచ్చిన కందుల దుర్గేష్!

Reddy P Rajasekhar
ఏపీ మంత్రి కందుల దుర్గేష్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల బంద్ తెరపైకి రావడం గురించి రియాక్ట్ అయ్యారు. ఏపీ సర్కార్ ఏనాడైనా సినిమాలకు ఇబ్బంది కలిగించిందా అని ఆయన ప్రశ్నించారు. నిర్మాతలు విడివిడిగా అడిగినా టికెట్ రేట్ల పెంపు విషయంలో అనుమతి ఇచ్చామని సమిష్టిగా రండి సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పామని ఆయన అన్నారు.
 
అల్లు అరవింద్ వ్యాఖ్యలు సరైనవే అని ప్రస్తుతానికి థియేటర్ల బంద్ లేదు కాబట్టి సమస్య సమసిపోయినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై కార్యాచరణ అవసరం అని ఆయన కామెంట్లు చేశారు. ఇండస్ట్రీకి తొలి నుంచి గౌరవమిస్తూ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేశారని దుర్గేష్ పేర్కొన్నారు.
 
భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని గురించి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఆ రోజుల్లోనే వేర్వేరు కార్యక్రమాలను చేపట్టారని కందుల దుర్గేష్ కామెంట్లు చేశారు. బడ్జెట్ చూసి ధరలు పెంచాలని నిర్మాతలు కోరుతున్నారని సినిమా టికెట్ రేట్ల పెంపును హోం శాఖ ముఖ్య కార్యదర్శి చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
 
పెంచిన రేట్లపై ఎవరైనా పిల్ దాఖలు చేస్తే మేము కోర్టుకు వెళ్లి జవాబు చెప్పాల్సి వస్తోందని ఆయన అన్నారు. గతంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆ మాజీ మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే మానవత్వం ఉందా అని అనిపిస్తోందని కందుల దుర్గేష్ అన్నారు. హరిహర వీరమల్లు సినిమాను ఫ్లాప్ మూవీ అంటున్నారని సినిమా విడుదలకు ముందే ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని నానికి ఉద్దేశించి ఆయన ఈ కామెంట్లు చేశారు. కందుల దుర్గేష్ కామెంట్ల గురించి వైసీపీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: