బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినా జూనియర్ ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇవ్వని దర్శకులు వీళ్లే!
కృష్ణవంశీ, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, బాబీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ కు హిట్లు ఇచ్చినా ఈ దర్శకులకు తారక్ మరో ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం తారక్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. వార్2, డ్రాగన్ సినిమాలతో తారక్ మార్కెట్ మరింత పెరగడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ రెండు సినిమాలు బిజినెస్ విషయంలో సైతం అద్భుతాలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
సినిమాలకు సంబంధించి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త సినిమాల ప్రకటనల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.
2029 సంవత్సరం వరకు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా అయితే లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో భారీ రికార్డులు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. వార్2 సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలలో స్లిమ్ లుక్ లో కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.