బాలయ్యతో మరోసారి గోపీచంద్ మలినేని .. ఈసారి అలా ఇలా కాదు దబిడి దిబిడే..!
ఇక జూన్ 10 బాలయ్య పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఈ సినిమాని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి .. ఇక గోపీచంద్ రీసెంట్ గానే బాలీవుడ్లో సన్నీ డ్యూయల్ తో చేసిన్న జాట్ మూవీ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే .. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని సినిమాని మరోసారి మైత్రి సంస్థ నిర్మించబోతుంది .. ఇప్పటికే అఖండ 2 షూటింగ్ చివరి దశకు వచ్చేసింది .. ప్రస్తుతం జార్జియాలో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది .. అలాగే ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు . ఇక ఇప్పుడు బాలయ్య , గోపీచంద్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా కూడా .. బాలయ్య కెరీర్ లోనే ఇప్పుడు వరకు ఎప్పుడు చేయని కొత్త స్టోరీ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది .. గోపీచంద్ ఈసారి బాలయ్య తో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు