ప‌వ‌నాగ్ర‌హం: ప్రేక్ష‌కుల‌కు మేలు జ‌రుగుతుందా...?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ప్రముఖ హీరో జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తన వద్దకు ప్రత్యేకంగా ఎవరూ కూడా రావద్దు అంటే రావద్దు అని ఏదైనా ఉంటే అందరూ కలిసి వచ్చి అధికారులకు సమస్యలు వివరించాలని కూడా చెప్పకనే చెప్పేశారు. కారణాలు ఏవైనా పవన్ ఆగ్రహం అనేక రూపాలలో కనిపించింది. పవన్ తన సినిమా కోసం ఆగ్రహం వ్యక్తం చేశారా ? లేక టాలీవుడ్ లో పాతుకుపోయిన మాఫియా భ‌ర‌తం పట్టేందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేశారా ? లేదా మార్పు దిశగా అడుగులు వేస్తున్నారా అన్న చర్చలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సినిమా నిర్మాతలు .. ఆ న‌లుగురి పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన అదే సమయంలో ప్రేక్షకులు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న కీలక అంశాలపై కూడా పవన్ దృష్టిపెట్టారు. ఇది మేలైన నిర్ణయం అని ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.


ప్రస్తుతం సినిమా హాల్స్‌ పరిస్థితి ఎలా ఉందంటే ? నిర్బంధించి సొమ్ములు గుంజటమే. ఉదాహరణకు బయట పాప్ కార్న్‌ 50 రూపాయలు ఉంటే సినిమా హాళ్లలో అది 250 వరకు ఉంది. బయట సమోసా రు. 20 ఉంటే సినిమా హాళ్లలో 50 వసూలు చేస్తున్నారు. బయట నుంచి కనీసం మంచినీటి బాటిల్ కూడా తీసుకురాకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని హాల్లో కొందామంటే రు. 20 బాటిల్ ను రు. 40 కి విక్రయిస్తున్నారు. మ‌రుగు దొడ్లు అధ్వానం .. ముక్కు మూసుకోవాల్సిందే. ఏపీ స్టార్టింగ్ లో వేసి త‌ర్వాత తీసేస్తున్నారు. ప‌వ‌న్ ఇప్పుడు ఈ స‌మ‌స్య‌లు అన్నింటి పైనా దృష్టి పెట్ట‌నున్నారు. ఏదేమైనా ప‌వ‌న్ నిర్ణ‌యం వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు మేలు జ‌రిగితే బాగుంటుంద‌న్న కోణంలోనూ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: