పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నీది అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఏం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలం పాటు పూర్తి కాకపోవడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో కిరణ్ అబ్బవరం హీరో గా రూపొందిన రూల్స్ రంజాన్ మూవీ కి దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ మిగిలిన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు.
ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నైజాం హక్కులను భారీ ధరకు అమ్మాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క నైజాం ఏరియా హక్కులను తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు ఆల్మోస్ట్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
మైత్రి సంస్థ వారు ఈ సినిమా యొక్క నైజాం ఏరియా హక్కులను దాదాపు 36 కోట్ల ధరకు కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా నైజాం హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకుంటారా లేక వేరే ఎవరి చేతికైనా ఈ మూవీ నైజాం ఏరియా హక్కులు వెళతాయి అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.