అఖండ 2 లో బాల‌య్య నుంచి ఎవ్వ‌రూ ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌... బోయ‌పాటి అదుర్స్‌..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా ఇప్పుడు చేస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మాస్ సీక్వెల్ అఖండ 2. దర్శకుడు బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 పై కని వినీ ఎరుగని రీతిలో అంచనాలు ఉన్నాయి. ఈ హైప్‌ కు తగినట్టుగానే మేకర్ సాలిడ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఎవరు ఊహించని విధంగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ లో మాత్రమే అంటే దాదాపు రెండు లుక్స్ లో మాత్రమే కనిపిస్తారని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు.


అయితే బోయపాటి ఎవరూ ఊహించిన విధంగా సర్ప్రైజ్ ఇస్తున్నాడట. బాలయ్య పై మూడో లుక్‌ కూడా ఉందని తెలుస్తోంది. ఇది కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చి రీతిలో ఉంటుందని టాక్. మరి ఈ విషయం ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి. ఈ సినిమా టీజ‌ర్ జూన్ లో బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్‌ సంగీతం అందిస్తుండగా ... 14 రీల్స్‌ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 200 కోట్ల వ‌ర‌కు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: