ఆ స్టార్ హీరో ఫోన్ నెంబ‌ర్ లీక్ చేసిన మ‌నోజ్‌.. ఇంత దూల ఏంట‌య్య నీకు!

Kavya Nekkanti
మంచు మనోజ్ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత `భైరవం` మూవీతో వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన మల్టీస్టారర్ మూవీనే భైరవం. ఇందులో మంచు మనోజ్‌తో పాటుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ చిత్రం మే 30న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల ద్వారా భైరవంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. డైరెక్టర్ సంప‌ద్ నంది, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంతో సందడిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.



అయితే ఈవెంట్లో భాగంగా మనోజ్‌ లైవ్ లోనే తమిళ స్టార్ హీరో శింబుకి ఫోన్ చేశాడు. మనోజ్ ఫోన్‌లో వాయిస్ స‌రిగ్గా వినిపించ‌క‌పోవ‌డంతో.. హీరోయిన్ అదితి శంక‌ర్ ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. మ‌నోజ్‌-శింబు మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ జ‌రిగింది. `కమల్ హాసన్ సార్ తో నటించావు.. నిన్ను చూస్తే జలసీగా ఉంది.. థ‌గ్‌ లైఫ్ కు ఆల్ ది బెస్ట్ మచ్చా..` అని మనోజ్ చెప్ప‌గా.. అందుకు శింబు `థాంక్స్.. అలాగే మనోజ్ గురించి ఒక విషయం చెప్పాలి. మనోజ్ చిన్నపిల్లాడి లాంటివాడు. మనం ప్రేమిస్తే తిరిగి అంతకుమించిన ప్రేమను చూపిస్తాడు. అదే ద్వేషిస్తే అతనితో మనకే రిస్క్` అని చెప్పి అంద‌రినీ న‌వ్వించాడు.



అయితే ఈ సంభాషణ అంతా బాగానే ఉంది. కానీ మ‌నోజ్ అనుకోకుండా శింబు ఫోన్ నెంబర్ బయటకు కనిపించేలా పెట్టి మాట్లాడాడు. ఈ విషయాన్ని గుర్తించిన యాంకర్ సుమ.. వెంట‌నే ఫోన్ అటుగా తిప్పింది. దాంతో మ‌నోజ్ `మ‌చ్చా ఫోన్ నెంబర్ లీక్ అయినట్టుగా ఉంది.. మీకు కొత్త సిమ్ పంపిస్తాలే` అంటూ న‌వ్వేశాడు. అందుకు శింబు `అయ్య‌య్యో..` అంటూ ఒకింత‌ షాక్ అయ్యాడు. ఇక ఇదే విష‌యంపై సుమ‌.. `మనోజ్ ప్రేమను మాత్రమే కాదు ఆయ‌న నెంబర్‌ను కూడా అందరికీ ఇచ్చేశారు` అంటూ కౌంట‌ర్ వేసింది. మొత్తానికి శింబు ఫోన్ నెంబ‌ర్ లీక్ అవ్వ‌డంతో.. ఇంత దూల ఏంట‌య్య నీకు అంటూ నెటిజ‌న్లు సైతం స‌ర‌దాగా మ‌నోజ్‌పై సెటైర్లు పేలుస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: