టాలీవుడ్ ప్రక్షాళన దిశగా పవన్ కళ్యాణ్.. షరతులు విధిస్తే వంకర బుద్ధి మారుతుందా?
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రతినిధులు... ఎవరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను... కలవ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏదో చేద్దామని కూటమి ప్రభుత్వం రెడీగా ఉందని... కానీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దానికి సహకరించడం లేదంటూ చెప్పగానే చెప్పారు పవన్ కళ్యాణ్. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సినిమా రంగం వారిని అలాగే అగ్రనటులను... ఒక ఆట ఆడుతుందని గుర్తు చేశారు.
కానీ తమ ప్రభుత్వం అలా కాదని... మేము కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పని చేస్తామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. మీకు ఏమైనా డిమాండ్స్ ఉంటే వచ్చి తమతో మాట్లాడాలని.. ఏపీలో.. ఇండస్ట్రీని డెవలప్ చేసేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో... కొంతమంది ఏపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా... కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వారి బుద్ధి మారేలా కనిపించడం లేదు. షరతులు విధిస్తే వంకర బుద్ధి మారుతుందా అని కూడా చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఒక కారణంగా... అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుందని కొత్త చర్చ మొదలైంది. ఏపీలో కూటమి పూర్తిగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా... పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను కూడా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీకి మంచి చేద్దామనుకున్న పవన్ కళ్యాణ్ కి... పంగనామాలు పెట్టే పరిస్థితి నెలకొందానికి కూడా చెబుతున్నారు. మరి.. ఇప్పటికైనా టాలీవుడ్ ప్రముఖులు ఏకమై ముందుకు వెళ్తారా... గ్రూపులుగా డివైడ్ అయ్యి ఇండస్ట్రీని నాశనం చేస్తారనేది చూడాలి.