ఆనందరావు కుటుంబరావు ల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్న వెంకటేష్ !
లేటెస్ట్ గా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్ బష్టర్ మూవీగా మారడంతో వెంకటేష్ క్రేజ్ మరియు మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది. దీనితో వెంకటేష్ త్వరలో నటించబోయే 75వ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. ఈమూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈమూవీ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ పెరిగింది.
ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన త్రివిక్రమ్ ఈమూవీలో నటించే కీలక నటీనటుల ఎంపిక పై దృష్టిని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో వెంకీ పక్కన కన్నడ క్రేజీ హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఎంపిక అయింది అని టాక్. ఇప్పటికే ఆమె జూనియర్ ఎన్టీఆర్ పక్కన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ప్రాజెక్ట్ లో ఈమె హీరోయిన్ గా ఎంపిక కావడంతో రుక్మిణీ వసంత్ పీరు మారుమ్రోగి పోతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందబోయే ఈమూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ లో విడుదల చేయాలని త్రివిక్రమ్ ఆలోచన అని అంటున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ కు పెరిగిన క్రేజ్ రీత్యా ఈమూవీలో నాటిస్తున్నందుకు అతడికి 30 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు కథ రీత్యా కుటుంబ రావ్ లేదంటే ఆనంద్ రావ్ టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో వెంకటేష్ త్రివిక్రమ్ లు ఉన్నట్లు టాక్..