అమితాబ్ బచ్చన్ తో హీరోయిన్ రొమాన్స్.. కుళ్లుకున్న జయా బచ్చన్ ఏం చేసిందంటే.?

Pandrala Sravanthi
అమితాబ్ బచ్చన్ ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఎంతో మంది హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. అయితే తనతో సినిమాల్లో కలిసి వర్క్ చేసిన హీరోయిన్ జయా బచ్చన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అమితాబ్ బచ్చన్ కి ఒకప్పటి హీరోయిన్ అయినటువంటి రేఖతో ఎఫైర్ ఉండేది అనే వార్తలు మాత్రం ఇప్పటికీ బీటౌన్ లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే బాలీవుడ్ నటి రేఖ అంటే జయా బచ్చన్ కి కూడా ఇష్టం లేదు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.కానీ రేఖ మాత్రం జయా బచ్చన్ ని గౌరవిస్తూనే ఉంటుంది. జయా బచ్చన్ గురించి ఏ ఇంటర్వ్యూలో స్పందించమని అడిగినా కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంది. అయితే రేఖ అమితాబ్ బచ్చన్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. 


అలా అమితాబ్ బచ్చన్ రేఖ కలిసి ముకద్దర్ కా సికిందర్ సినిమా చేసిన సమయంలో ఈ సినిమాలో వీరి రొమాన్స్ చూసి జయా బచ్చన్ కన్నీళ్లు పెట్టుకుందట.అయితే ఈ సినిమాని మొదట ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించారట. ఆలా  ఈ మూవీ చూడడానికి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం వచ్చారట. అలా సినిమా చూస్తున్న సమయంలో ప్రొజెక్షన్ రూమ్ లో ఉన్న జయా బచ్చన్ ని రేఖ గమనించిందట. ఇక రేఖ అమితాబ్ బచ్చన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వచ్చిన సమయంలో ఆ సన్నివేశాలు చూసి జయా బచ్చన్ కన్నీళ్లు పెట్టుకుందట. అయితే ఆ కన్నీళ్లు సినిమా మీద ఉన్న అభిమానంతో కాదు తన భర్త మరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడు అనే కోపం,అసూయతో జయ బచ్చన్ అలా కన్నీళ్లు పెట్టుకుందట. ఆ తర్వాత వారం రోజులకే సినిమా ఇండస్ట్రీ మొత్తం రేఖ గురించి మాట్లాడుకున్నారట.


ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఇప్పటినుండి రేఖతో సినిమాలు చేయట్లేదని,దర్శక నిర్మాతలకు కూడా తనతో రేఖని హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీయకూడదు అని తేల్చి చెప్పారట.అయితే ఈ విషయం రేఖ దాకా రావడంతో ఆమె కూడా షాక్ అయిపోయిందట. అయితే అమితాబ్ బచ్చన్ రేఖ ఇద్దరిదీ హిట్ పెయిర్.. అలాంటిది వీరి కాంబోలో మళ్లీ సినిమాలు రాదని తెలిసి చాలామంది అభిమానులు బాధపడ్డారు. కానీ జయా బచ్చన్ మాత్రం ఆ సినిమా చూశాక రేఖతో మీరు నటించకూడదు అని కండిషన్ పెట్టిందట. ఇక భార్య పెట్టిన కండిషన్ ని ఒప్పుకున్న అమితాబ్ బచ్చన్ అప్పటినుండి రేఖతో సినిమాలు చేయడం మానేశారట.చివరిగా రేఖ అమితాబ్ బచ్చన్ కాంబో లో సిల్సిలా అనే మూవీ వచ్చింది. అయితే జయా బచ్చన్ తమ రొమాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని రేఖ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: