వారెవ్వా.. ఇది బ్లాస్టింగ్ కాంబో అంటే.. బన్నీ-ప్రభాస్ లు ఒక్కే సినిమాలో..!?
ఇద్దరు బడా పాన్ ఇండియా 100 కోట్ల స్టార్ హీరోస్ కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారట. అయితే ఇది కేవలం గెస్ట్ పాత్రలుగా మాత్రమే అంటూ తెలుస్తుంది . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో బన్నీ - ప్రభాస్ లు గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట . రన్బీర్ కపూర్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ ఒక బిగ్ ప్రాజెక్టును తెరపైకి తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో ఆల్రెడీ బన్నీని ఓ పాత్ర కోసం చూస్ చేసుకున్నారట. ఇన్నాళ్లు ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది.
ఇప్పుడు ప్రభాస్ కూడా ఇంకో పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . అయితే ఇద్దరిదీ కూడా తక్కువ టైం ఉండే పాత్ర అని..కానీ నెగటివ్‌గా చూపించబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అది పాజిటివ్ రోల్ నా..? నెగటివ్ రోల్ నా..? పక్కన పెడితే బన్నీ - ప్రభాస్ ని తెరపై ఒకే స్క్రీన్ పై చూడాలి అంటూ ఎప్పటినుంచో కోట్లాదిమంది జనాలు వెయిట్ చేస్తున్నారు . ఫైనల్ గా ఆ కోరిక తీరబోతుంది అని తెలియడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి ఖుషి గా ఉన్నారు . కానీ తెలుగు సినిమాలో నటిస్తే బాగుండేదిగా అంటూ మాట్లాడుకుంటున్నారు..!