హీరోయిన్స్ హ్యాపీ బర్త డే కి విషెస్ చేసే ఈ బిగ్ స్టార్ కి.. టెర్రరిస్ట్ అటాక్ పై స్పందించే తీరిక లేదా..?

Thota Jaya Madhuri
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్క విషయం కూడా ఇట్టే ట్రెండ్ అయిపోతూ.. జెట్ స్పీడ్ లో వైరల్ గా మారుతుంది.  మరీ ముఖ్యంగా ఏ సినిమా గురించైనా చెప్పాలి అనుకున్న ఏ హీరో హీరోయిన్ కి విష్ చేయాలి అనుకున్న ఏదైనా విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవాలి అనుకున్న .. స్టార్స్ ఎక్కువగా ఉపయోగించేది సోషల్ మీడియా . యూట్యూబ్ ఛానల్ లో లైవ్ ఇవ్వడం.. ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకి ఆ విషయాన్ని షేర్ చేయడం ..ఎక్స్ ట్వీట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.  అయితే చాలామంది స్టార్ హీరోస్ మరొక హీరో బర్త్డ డే అయినా మరొక హీరోయిన్ బర్త్డ డే అయినా ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు .



సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ మాత్రం ఏ హీరోయిన్ పుట్టినరోజు అయినా..  ఏ హీరో పుట్టినరోజు .. అయినా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన టీజర్ రిలీజ్ అయిన .. వాళ్ల సీక్రేట్స్..ఎఫైర్స్ ..ఎటువంటి సినిమా అప్డేట్ కు సంబంధించిన విషయమైనా వెంటనే పోస్ట్ పెడుతూ వారిని అభినందిస్తూ మరికొన్నిసార్లు సెటైరికల్ గా ట్విట్స్ చేస్తూ ఉంటారు . కానీ ఇప్పుడు మాత్రం ఈ స్టార్ సైలెంట్ అయిపోయాడు.  రీసెంట్గా కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ అందరికీ తెలిసిందే . ప్రతి ఒక్క ఇండియన్ బ్లడ్ ఆ విజువల్స్ చూసినప్పటి నుంచి మరిగిపోతుంది .



ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు పెట్టే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు . అయితే ప్రతి చిన్న విషయాన్ని..అలాగే  హీరోయిన్స్ హ్యాపీ బర్త డే విషయాలని అస్సలు మర్చిపోని ఈ స్టార్ ఇంత పెద్ద అటాక్ జరిగితే దాని గురించి ఒక్కటంటే ఒక్క పోస్ట్ పెట్టకపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అయితే కొంతమంది జనాలు దీన్ని చూసి చూడనట్లు వదిలేస్తుంటే మరి కొంతమంది మాత్రం కావాలని ఆ స్టార్ పై నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: