ఎన్టీఆర్ ఆర్ట్స్ విమర్శలపై.. కళ్యాణ్ రామ్ దిమ్మతిరిగే సమాధానం..!

frame ఎన్టీఆర్ ఆర్ట్స్ విమర్శలపై.. కళ్యాణ్ రామ్ దిమ్మతిరిగే సమాధానం..!

Divya
నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థలో ఎన్నో చిత్రాలు తెరకెక్కించి విడుదల చేశారు. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో మంచి విజయాలను లాభాలను కూడా అందుకున్నారు. కళ్యాణ్ రామ్ తన తమ్ముడుతో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రొడక్షన్ విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా చేస్తూ ఉంటారు. అందుకే కళ్యాణ్ రామ్ బ్యానర్ లో వచ్చే సినిమాలను అభిమానులు చాలా స్పెషల్ గా చూస్తూ ఉంటారు.


కానీ ఇటీవలే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ విషయంలో ప్రొడక్షన్ వాల్యూ సరిగ్గా లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయని  ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ పాల్గొన్నప్పుడు ప్రశ్నించారట. కళ్యాణ్ రామ్ నెగిటివిటీ కామెంట్స్ ను అసలు పట్టించుకోనని తన సంస్థ పేరు చెడేలా తాము ఎప్పుడూ కూడా వ్యవహరించమని తెలియజేశారు. నిజంగా దేవరలో క్వాలిటీ తగ్గి ఉంటే తారక్ అసలు ఊరుకోడు దేవర సినిమా కోసం తామెంత కష్టపడ్డామో తన టీమ్ కి ఎన్టీఆర్ కి మాత్రమే తెలుసు అని ఎక్కువగా సముద్రం నేపథ్యంలో వాటర్ సీక్వెల్స్ లను తీయడం అంత తేలికైన విషయం కాదు అని తెలిపారు.


ఇలాంటి వీడియోస్ తెలుగులో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదని కళ్యాణ్ రామ్ సమాధానాలను తెలిపారు. ఇక జనాలకు కూడా ఏదో ఒక నెగెటివిటీ ఉండాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు కానీ తాను మాత్రం ఎప్పుడూ పాజిటివ్ వాటినే తీసుకుంటానని తెలిపారు. దేవర సినిమాకి రిలీజ్ కళ్యాణ్ రామ్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సరికొత్త ట్రెండును సెట్ చేస్తుందని చెప్పారు.కానీ ఇందులో కొన్ని కొన్ని సన్నివేశాలు విమర్శకులకు స్థానం కల్పించడమే కాకుండా అభిమానులను కూడా అసంతృప్తిని తెలియజేసినట్లు వెల్లడించారు. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశలో ఉండేవారు కానీ సినిమా విడుదలైన తరువాత రాను రాను కలెక్షన్స్ పెరగడంతో పాటు ఓటీటి లోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: