కొంతమంది హీరోలను ఒక సినిమాలో కాస్త బొద్దుగా చూసి మళ్లీ తర్వాత కాస్త సన్నబడితే ఆ హీరోకి ఏం జరిగిందో అని అభిమానుల్లో ఆందోళన ఉంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ల్లో కూడా అలాంటి ఆందోళనే ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా సన్నబడిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా తన అన్న కళ్యాణ్ రామ్ కోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా ఈవెంట్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ ఈవెంట్ కి వచ్చిన నందమూరి అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని చూసి షాక్ అయిపోయారు. దానికి ప్రధాన కారణం ఆయన సన్నబడిపోవడమే..ఎంతో బొద్దుగా కనిపించే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుండి అలా సన్నబడి పోయేసరికి ఎన్టీఆర్ రూపు రేఖలు చూసి చాలామంది షాక్ అయిపోయారు.
ఇదేంటి ఎన్టీఆర్ ఇలా అయిపోయారు.దేవర సినిమాకి ఇప్పటికి మరీ ఇంత చేంజింగా అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఎన్టీఆర్ అలా సన్నబడడానికి కారణం ఆయన ఆరోగ్యం బాలేదు కావచ్చు అని కొంతమంది అనుకున్నారు.కానీ అవేవీ కావట.మరి ఇంతకీ ఎన్టీఆర్ అలా సన్నబడడానికి కారణం ఏంటి అనేది కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో.. అయితే చాలామంది ఆయన సన్నబడిపోయారు అంటున్నారు. కానీ ఆయన ఎలా ఉన్నా ఏం చేసినా అది మొత్తం సినిమా కోసమే అంటూ చెప్పుకొచ్చారు..
ఇక కళ్యాణ్ రామ్ మాటలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్టీఆర్ సన్నబడడానికి కారణం అదే ఇదే అంటూ ఎన్నో రకాల రూమర్లు క్రియేట్ చేశారు. కానీ ఆయన సినిమా కోసమే అలా సన్నబడ్డారని కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పడంతో ఎన్టీఆర్ కి సినిమాల మీద ఎంత డెడికేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రశాంత్ నీల్ సినిమా అయిపోవడంతోనే ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివతో దేవర-2 ప్రాజెక్టులో భాగమవుతారని సమాచారం.