
పాన్ ఇండియాలోనే కాదు ఐపీఎల్ లో కూడా టాలీవుడ్ డామినేషన్..!
ఇక ఈసారి ఐపీఎల్ లో మాత్రం మన తెలుగు సినిమాల డామినేషన్ అండ్ మేనియా గట్టిగా కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు . ప్రధానంగా సోషల్ మీడియాలో ముంబై , రాజస్థాన్ , ఢిల్లీ ఇంకా పంజాబ్ కింగ్స్ లాంటి నార్త్ ఇండియా జట్లు సోషల్ మీడియాలో సైతం మన తెలుగు సినిమాల టెంప్లేట్స్ ఇంకా మీమ్స్ తో అలరిస్తూ ఉండటం అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తున్నాయి .. అలాగే దీనితో పాటు పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఐపీఎల్ లో కూడా ఓ రేంజ్ లో టాలీవుడ్ సినిమాలు గట్టి హవా చూపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు .. ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ చిత్ర పరిశ్రమ గా టాలీవుడ్ వెలుగు అందుతుంది ..
టాలీవుడ్ నుంచి సినిమా వస్తుందంటే ఇండియన్ చిత్ర పరిశ్రమలో వస్తున్న మిగిలిన సినిమాలన్నీ పక్కకు వెళ్లిపోయ్యే సిచువేషన్ కి వచ్చేసాయి .. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రభాస్ , ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి హీరోలు ఇండియన్ చిత్ర పరిశ్రమ కే నెంబర్ వన్ హీరోలుగా ఉంటూ బాలీవుడ్ హీరోలకు సైతం చుక్కలు చూపిస్తున్నారు .. ఇప్పటికే ప్రభాస్ , అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తూ అదరగొడుతున్నారు .. ఇలాంటి క్రమంలో ఐపిఎల్ లో కూడా తెలుగు హీరోల డామినేషన్ గట్టిగా కనిపించడం ఐపీఎల్ లో హాట్ టాపిక్ లో మారింది ..