అల్లు అర్జున్ అట్లీ సినిమా అప్పుడే క్రేజీ ప్రమోషన్స్ .. ఈసారి బాక్స్ ఆఫీస్ కు దబిడి దిబిడే..!

frame అల్లు అర్జున్ అట్లీ సినిమా అప్పుడే క్రేజీ ప్రమోషన్స్ .. ఈసారి బాక్స్ ఆఫీస్ కు దబిడి దిబిడే..!

Amruth kumar
పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమా దగ్గర అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ .. ఇప్పుడు తన తర్వాత సినిమాను కూడా క్రేజీ దర్శకుడు కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో తన సినిమాను రీసెంట్ గానే మొదలుపెట్టాడు .. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను ప్రకటించడం ఇప్పుడు అందరిలో హాట్‌ టాపిక్ గా మారింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు .. కానీ అప్పుడే మాస్‌ ప్రమోషన్స్ ని మొదలు పెట్టడం అందరికీ షాకింగ్ గా మారింది ..


ఇక నిన్న జరిగిన హైదరాబాద్ , ఢిల్లీ మ్యాచ్లో ఈ సినిమా అనౌన్స్మెంట్ తాలూకు వీడియోలు అక్కడ ఎల్ఈడి స్క్రీన్ లో ప్లే చేయటం అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది . ఇక దీంతో ఈ సినిమా మేకర్స్  తమ సినిమాని ఏ రేంజ్ లో ఉండాలో ఇప్పటి నుంచే ప్రమోషన్ చేసుకుంటున్నారు అర్థం చేసుకోవచ్చు .. ఇక మరి ఇప్పుడు నుంచి ఈ లెవెల్ లో ఉంటే ఇక సినిమా మొదలై రిలీజ్ సమయానికి ఇంకా ఎలా ఉంటుందో కూడా అని అందరిలో ఆసక్తిగా మారింది .. ఇక మరి ఈ  భారీ పాన్ ఇండియా సినిమాని సన్ పిక్చర్స్ వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తుండ గా అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుంది .  


అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా ప్రియాంక చోప్రా లేదా జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా ఓ హాలీవుడ్ స్టార్ నటుడు నటించబోతున్నారని కూడా అంటున్నారు .. పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ నుంచి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా పై అంచనాలు కూడా భారీ లెవెల్ లోనే ఉంటాయి .  ఆ అంచనలకు తగ్గట్టుగానే అట్లీ ఈ సినిమా ను ఊహించని రేంజ్ లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: