అఖండ2 ఇంటర్వెల్ అలా ఉండబోతుందా.. బోయపాటి ప్లానింగ్ మాత్రం వేరే లెవెల్!

frame అఖండ2 ఇంటర్వెల్ అలా ఉండబోతుందా.. బోయపాటి ప్లానింగ్ మాత్రం వేరే లెవెల్!

Reddy P Rajasekhar
బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తెరకెక్కాల్సి ఉండగా దాదాపుగా 200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కూడా అస్సలు రాజీ పడటం లేదని చెప్పవచ్చు.
 
అఖండ సినిమాకు ఇంటర్వెల్ సీన్ హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అఖండ సీక్వెల్ కు ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని సమాచారం అందుతోంది. బోయపాటి శ్రీను ప్లానింగ్ తో ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ సెప్టెంబర్ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
 
ఏదైనా కారణం వల్ల ఆ తేదీ మిస్ అయితే మాత్రం డిసెంబర్ లో అఖండ సీక్వెల్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. బాలయ్య మాస్ మసాలా సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్యతో సినిమా చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అఖండ2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.
 
మరోవైపు బాలయ్య పారితోషికం సైతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సీనియర్ హీరోలలో బాలయ్యకు బాలయ్య మాత్రమే సాటి అని చెప్పవచ్చు. ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న హీరోలు తక్కువమంది ఉన్నారు. బాలయ్య భవిష్యత్తులో మరిన్ని రికార్డులను క్రియేట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమా సక్సెస్ సాధించడం డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సైతం కీలకం అని చెప్పవచ్చు. బాలయ్య పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: