"బుక్ మై షో"లో దుమ్ము దులుపుతున్న మ్యాడ్ స్క్వేర్.. ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో తెలుసా..?

frame "బుక్ మై షో"లో దుమ్ము దులుపుతున్న మ్యాడ్ స్క్వేర్.. ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో తెలుసా..?

Pulgam Srinivas
తాజా గా మంచి అంచనా ల నడుమ మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ థియేటర్ల లో విడుదల అయిన విషయం మన అందరి కీ తెలిసిందే . ఈ సినిమాను మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు . ఇక పోతే దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన మ్యాడ్ మూవీ కి ఈ సినిమా కొనసాగింపుగా రూపొందింది. దానితో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది.


దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ భారీ లాభాలను కూడా అందుకుంది. మరికొన్ని రోజులు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.
 


ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో లో కూడా మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు మ్యాడ్ స్క్వేర్ మూవీ కి సంబంధించిన 900 కే ప్లస్ టికెట్లు బుక్ మై షో యాప్ లో సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ బుక్ మై షో ఆప్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: