
నిజ జీవితంలో సైతం తగ్గేదేలే.. అల్లు అర్జున్ కు మాత్రమే సొంతమైన ఘనతలివే!
పుష్ప ది రూల్ మూవీ బాహుబలి2 రికార్డులను సైతం బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈరోజు అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు కాగా ఈ స్టార్ హీరో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారాన్ని అందుకున్న తొలి సౌత్ నటుడు బన్నీ కావడం గమనార్హం.
బన్నీ యాక్టింగ్ కు రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. పుష్ప సినిమాలో యాక్టింగ్ కు బన్నీకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ రాగా ఈ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం గమనార్హం. దేశముదురు సినిమాతో బన్నీ టాలీవుడ్ కు సిక్స్ ప్యాక్ పరిచయం చేశారు. టైటానిక్, ఇంద్ర బన్నీకి బాగా నచ్చే సినిమాలు అనే సంగతి తెలిసిందే.
ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేయగా పుష్ప1 2021 సంవత్సరంలో దేశంలోనే బిగ్గెస్ట్ హిట్ కావడం గమనార్హం. పుష్ప2 సినిమాకు బన్నీ 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. బద్రీనాథ్ సినిమా కోసం బన్నీ కత్తి యుద్ధం నేర్చుకున్నారు. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అంటే బన్నీకి ఎంతో అభిమానం.