పవన్ కళ్యాణ్ కుమారుడికి అగ్ని ప్రమాదం ?

frame పవన్ కళ్యాణ్ కుమారుడికి అగ్ని ప్రమాదం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన కుమారుడికి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్ని ప్రమాదం జరగగా... అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ పెను ప్రమాదం సింగపూర్ లో జరిగింది. సింగపూర్ లోని పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్.. చదువుతున్న స్కూల్లోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఒకసారిగా స్కూల్లో మంటలు ఎగిసిపడడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.

 సింగపూర్ లో ఈ ప్రమాదం జరగడంతో మార్క్ శంకర్ చేతులు అలాగే కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల లోకి పొగ వెళ్ళిందని చెబుతున్నారు.. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకరును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన్యం పర్యటనలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

 అయితే ఈ విషయం తెలియగానే... తన పర్యటన ముగించుకొని.. హుటాహుటిన సింగపూర్ బయలుదేరారు పవన్ కళ్యాణ్. తన కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అటు సింగపూర్ లో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఆరోగ్య పరిస్థితి కాస్త కుదిటపడినట్లు తెలుస్తోంది. కానీ ఊపిరితిత్తుల లోకి పొగ వెళ్లడంతో... ఐసీయూలో వేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

 ఇది ఇలా ఉండగా... నిన్నటి నుంచి అరకు సమీపంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే గిరిజనుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇవాళ కూడా గిరిజన గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. కానీ ఇంతలోనే పవన్ కళ్యాణ్ కొడుకుకు ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: