ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. వార్నింగ్ ఇచ్చిన పంజుర్లి దేవత.?

frame ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. వార్నింగ్ ఇచ్చిన పంజుర్లి దేవత.?

Pandrala Sravanthi
కన్నడ ఇండస్ట్రీలో అత్యంత పేరు తెచ్చుకున్న హీరోలలో రిషబ్ శెట్టి ఒకరు. ఈయన కేవలం హీరో గానే కాకుండా డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవుతున్నారు. మరి అలాంటి రిషబ్ శెట్టికి అంతటి స్టార్డం ఇచ్చిన సినిమా ఏంటయ్యా అంటే  కాంతారా. ఈ సినిమాకు ముందు ఆయన ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో రిషబ్ శెట్టి అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఒక మైథాలజికల్ కథతో మన ముందుకు వచ్చినటువంటి రిషబ్ శెట్టి ,  కాంతారతో  అద్భుతమైన హిట్ అందుకున్నారు. ముఖ్యంగా పంజూర్లి గ్రామ దేవత నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం  రిషబ్ శెట్టి తన సొంత ఊరిలో పాటించే దైవ నియమాల ప్రకారం ఈ సినిమాను తీశారు.


 ఇప్పటికే రిషబ్ శెట్టి సొంత ఊరితో పాటు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పంజూర్లి దేవతకు సంబంధించినటువంటి  పూజలు నిర్వహిస్తారు. అయితే తాజాగా మంగుళూరులోని పంజూర్లి దేవస్థానాన్ని సందర్శించాడు. ఈ సంవత్సరం  ఈ వేడుకల్లో రిసెప్ట్ శెట్టి పాల్గొంటారు. ఇదే తరుణంలో  రిషబ్ తో దేవుడు పూనిన పంజూర్లి పూజారి మాట్లాడుతూ  నీ చుట్టూ ఎంతో మంది శత్రువులు తయారవుతున్నారు, నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడని హామీ ఇచ్చారు.


ఇక పంజుర్లీ మాటలు విన్న అక్కడ ఉన్న భక్తులంతా  చాలా ఆశ్చర్యపోయారు. నిజానికి రిషబ్ శెట్టి కాంతారా పార్ట్ 1 తీస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ టైంలో  కొంతమంది రాజకీయ నాయకులు రిసెబ్ శెట్టిని ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో పేలుడు పదార్థాలు వాడుతున్నారని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే వీరు వెళుతున్న వాహనం కూడా ప్రమాదానికి గురై గాయాల పాలయ్యారు. ఇలా సినిమా తీస్తున్నన్ని రోజులు ఏదో ఒక ఇబ్బందితో రిషబ్ శెట్టి చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: