
హీరోయిన్ గానే కాదు అలా కూడా సక్సెస్ అందుకోలేక పోయిన స్టార్ హీరోయిన్ .. ?
ఇండస్ట్రీలో కి అడుగు పెట్టడమే సరైన టైం లో అడుగు పెట్టలేక పోయింది హీరోయిన్ కేతిక శర్మ .. ఇలా నాలుగేళ్లగా పరిశ్రమ లో ఉంటున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేకపోయింది .. ఇక చివరికి ఐటెం సాంగ్ కూడా ఆమె కెరీర్ కు ఎలాంటి ఆక్సిజన్ ల పనిచేయలేక పోయింది .. పూరి జగన్నాథ్ కొడుకు నటించిన రొమాంటిక్ సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైంది కేతికా శర్మ .. ఆ సినిమా డిజాస్టర్ ఆ తర్వాత లక్ష్యం , రంగ రంగ వైభవంగా సినిమాలు చేసింది .. అవి కూడా బాక్సాఫీస్ దగ్గర చేదు ఫలితాలు అందుకున్నాయి .. ఎన్నో ఆశల తో చేసిన బ్రో సినిమా ఆమె కెరియర్ కు అసలు ఎక్కడ కలిసి రాలేదు .. ఇక ఇప్పటివరకు కేతిక నటించిన పెద్ద సినిమా కూడా ఇదే ..
అదే ప్లాఫ్ అవడం తో ఇండస్ట్రీ ఆమె ను పట్టించుకోవడం మానేసింది . ఇక హీరోయిన్ గా అవకాశాలు రావని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత నితిన్ రాబిన్ హుడ్ సినిమా లో స్పెషల్ సాంగ్ కూడా చేసింది కేతిక .. పలు వివాదాస్పద డాన్స్ మూమెంట్స్ కూడా చేసింది .. ఆ వివాదమే కాదు సినిమా కూడా ఆమె కు అసలు ఏ విధంగా కూడా కలిసి రాలేదు .. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి లో ఉన్న ఒకే ఒక్క మూవీ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ .. ఇక ఈ సినిమా ఆమె కెరీర్ ను డిసైడ్ చేసే మూవీగా మారబోతుంది .. ఈ సినిమా అయన హిట్ అయితే తప్ప ఈమె కు ఇండస్ట్రీ లో అవకాశాలు రావు . ఇలా కేతిక కెరియర్ ఊహించిన విధంగా దారుణంగా డిజాస్టర్ గా మిగిలిపోతుంది ..