వర్కౌట్ చేస్తూ గాయపడ్డ స్టార్ బ్యూటీ .. సినిమాల నుంచి అవుట్..?
ఇక రకుల్ 2024 అక్టోబర్లో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండ గా వెన్ను కు గాయమైంది . ఇక ఆమె ఆ సమయంలో 80 కిలోల బరువును డేట్ లీఫ్ట్ చేసే సమయంలో ఈ గాయం అయింది .. ఆ సమయంలో వెన్నునొప్పి ఉన్నప్పటి కీ దాన్ని పట్టించుకోకుండా వ్యాయామం చేయడం తో ఆ గాయం కాస్త తీవ్రమైంది . అయితే ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానితో పంచుకుంది . ఇక దాంతో ఆమె అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు .. అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదిక గా ఆమెకు పోస్ట్లు కామెంట్లు పెడుతున్నారు . అయితే ఈ గాయం కారణంగా ఆమె ఆరు రోజులు పాటు బ్లడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 నెలలు సమయం పట్టొచ్చు అని కూడా తెలిపింది .
అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ . తను ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకొండినట్టు .. కానీ గాయం నుంచి పూర్తిగా బయటకు రాలేదు అని కూడా తెలిపింది . శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవడం ఎంతో ముఖ్యమని తాను చేసిన తప్పులు ఇతరులు చేయవద్దని ఉచిత సలహా కూడా ఇచ్చింది రకుల్ . అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ తన తదుపరి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఆమె ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళుతుంది ఈ బ్యూటీ .. ఇక రకుల్ తెలుగులో సినిమాలు చేయడం తగ్గించింది ప్రస్తుతం బాలీవుడ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది .