అబ్బబ్బా..ఎన్నాళ్ళకి మళ్లీ తెర పై కనిపించబోతున్న హనీ రోజ్..ఏ హీరో సినిమాలో అంటే..?
నందమూరీ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఆమె పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది. "మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి" అంటూ అల్లాడించేసింది . అయితే ఆ తర్వాత చెప్పుకోతగ్గ క్యారెక్టర్ లో ఎక్కడ కనిపించలేదు హనీ రోజ్. అదృష్టం ఆమెను మళ్ళీ బాలయ్య రూపంలోనే వరించింది . బాలయ్య నటిస్తున్న "అఖండ 2" సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట. బోయపాటి శ్రీను ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. హనీ రోజు ఈ మధ్యకాలంలో చాలా కాంట్రవర్షియల్ మాటల్లో ఇరుక్కునింది .
అలాంటి బ్యూటీకి టాలీవుడ్ నుంచి ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు . చాలా మంది హనీ రోజ్ మా మూవీ లో వద్దు అంటూ కూడా రిజెక్ట్ చేశారు అనే మాటలు వినిపించాయి. కానీ బాలయ్య మాత్రం టాలెంట్ ని బాగా నమ్మాడు. ఆ కారణంగానే అఖండ టు లో స్పెషల్ సాంగ్ కోసం ఆమె పేరుని సజెస్ట్ చేశారు . బోయపాటికి కూడా బాలయ్య చెప్పిన దానికి ఓకే అన్నారు . ఇంకేముంది త్వరలోనే ఈ సాంగ్ కి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించబోతున్నారట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!