
చిరంజీవి-అనిల్ సినిమాకు ఆ కాపీడ్ టైటిల్..భలే ఫన్నీగా ఉందే..!?
దీంతో ప్రొడ్యూసర్స్ అందరూ అనిల్ రావిపూడి తో సినిమాను ఓకే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు . మరీ ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన "గేమ్ చేంజర్" సినిమా ఫ్లాప్ అవ్వడం "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా హిట్ అవ్వడంతోనే జనాల మైండ్ బ్లాక్ అయిపోయేలా చేసేసాడు అనిల్ రావిపూడి. " సంక్రాంతి వస్తున్నాం " సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు అభిమానులు వింటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమాను తెరకెక్కిస్తున్నారు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఫైనల్లీ అది చిరంజీవి అంటూ తేలిపోయింది . రీసెంట్ గానే చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా అన్షు అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ అనుకుంటున్నారట .అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . ఈ సినిమాకి "చిరునవ్వుల పండగ" అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశాడట అనిల్ రావిపూడి. త్వరలోనే టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించబోతున్నారట . టైటిల్ తోనే సినిమా ఎంత నవ్విస్తుందో అనే విషయం ఈజీగా అర్థమవుతుంది . ఇప్పటివరకు చిరంజీవి ఇలాంటి టైటిల్ పెట్టలేదు . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమా ఎలా ఉంటుంది..? ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అనే విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి . అయితే ఆల్ రెడి "చిరునవ్వు" సినిమా టైటిల్ ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు ఇది కాపీడ్ టైటిల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. ట్రోల్లింగ్ విషయం పక్కన పెడితే..మొత్తానికి చిరంజీవి మరో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడు అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక చిరంజీవికి హిట్ అన్న పదంకి ఆమడ దూరం వెళ్లిపోయాడు..!