ఏంటి వెంకటేష్ ఆ సమస్యతో బాధపడుతున్నారా..సినిమాలకు దూరమవ్వబోతున్నారా.. ఇంతకీ వెంకటేష్ కి వచ్చిన ఆ సమస్య ఏంటి..ఆయన ఏ నొప్పితో బాధపడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. వెంకటేష్ ఈ మధ్యనే సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల క్లబ్ లో చేరిన టాలీవుడ్ ఏకైక సీనియర్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి వెంకటేష్ ప్రస్తుతం కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అయితే వెంకటేష్ ప్రస్తుతం సినిమాలకు కమిట్ అవ్వకపోవడానికి కారణం ఆయనకు ఉన్న ఆ సమస్యేనట.ఆ సమస్య ఏంటంటే..
వెంకటేష్ తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నారట.ఈ సమస్య కారణంగానే ఆయన తన నెక్స్ట్ సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికీ కొద్దిరోజులు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్పారట.అయితే డాక్టర్స్ చెప్పినట్టు వినకుండా మళ్ళీ సినిమాల్లోకి వెళ్లి డాన్సులు, స్టంట్లు అంటూ చేస్తే నొప్పి మరింత తీవ్రమై అది సర్జరీ చేసే వరకు వెళ్తుందని డాక్టర్లు ముందుగానే హెచ్చరించారట.దాంతో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు అని వెంకటేష్ ప్రస్తుతం కొత్త సినిమాలు వేటికి కూడా కమిట్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్ కథలను వినే పనిలో పడ్డారట.
ప్రస్తుతం ఆయన తన మోకాలి నొప్పి బయటపడి పూర్తి ఆరోగ్యంగా తయారయ్యాకే మళ్లీ సినిమాలు చేద్దాం అని నిర్ణయించుకున్నారట. అందుకే మార్చి, ఏప్రిల్ ఈ రెండు నెలలు పూర్తిగా ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకొని మే లేదా జూన్ నెలలో తన కొత్త సినిమాని స్టార్ట్ చేయాలి అని వెంకటేష్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వెంకటేష్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.