పుష్ప 2: కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో వైరల్.. ఫ్యాన్స్ చూశారా..?

frame పుష్ప 2: కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో వైరల్.. ఫ్యాన్స్ చూశారా..?

Divya
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులను తిరగరాసింది. పాన్ ఇండియా లెవెల్ లో కూడా సరికొత్త రికార్డులను తిరగా రాసి ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ముఖ్యంగా అల్లు అర్జున్, రష్మిక నటన అద్భుతంగా ఉండడమే కాకుండా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ తో అలరించింది హీరోయిన్ శ్రీ లీల. ముఖ్యంగా డైలాగులు అల్లు అర్జున్ మేనరిజం కూడా ఈ సినిమాకి హైలెట్గా నిలిచాయి.


పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ ,శ్రీ లీల ఎంతో కష్టపడి కిస్సింగ్ సాంగ్ కి స్టెప్పులు వేశారు.. ముఖ్యంగా శ్రీ లీల ఈ పాట కోసం చేసిన రిహార్సల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ పాట విడుదలైనప్పటి నుంచి భారీ బజ్ అయితే ఏర్పడింది. పుష్ప సినిమాలోని సమంత చేసిన ఊ అంటావా మావా సాంగ్ ను పోల్చుతూ సమంత ముందు శ్రీ లీల తేలిపోయిందనే విధంగా చాలామంది ట్రోల్ చేయడం జరిగింది.


పుష్ప 2 చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో ని విడుదల చేయగా కొన్ని క్షణాలలోనే తెగ వైరల్ గా మారింది. ఈ సాంగ్ తర్వాత శ్రీలీలకి హీరోయిన్ కు భారీగా అవకాశాలు పెరిగిపోయాయని బాలీవుడ్ లో కూడా ఈమెకు పలు అవకాశాలను అందుకున్నది. మొత్తానికి ఒక పాటతో మళ్ళీ అవకాశాలను అందుకుంది శ్రీ లీల. అలాగే డైరెక్టర్ అట్లీ ,అల్లు అర్జున్ కాంబినేషన్లు సినిమా చేయబోతున్నారు.. ఒకవేళ ఈ సినిమా ఆలస్యం  అయితే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్త వినిపిస్తున్నాయి. మొత్తానికి అభిమానులు మాత్రం ఈ మేకింగ్ వీడియో చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా శ్రీ లీల, అల్లు అర్జున్ రష్మిక డాన్సర్లతో వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: