షాక్: రామ్ చరణ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..RC -16 రిలీజ్ వాయిదా..?

frame షాక్: రామ్ చరణ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..RC -16 రిలీజ్ వాయిదా..?

Divya
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,  డైరెక్టర్ బుచ్చి బాబు సన దర్శకత్వంలో వస్తున్న RC -16 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది నటీనటులు ఇందులో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రామ్ చరణ్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా అయితే వినిపిస్తోంది. మరింత ప్లస్గా మారుతున్నది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీకులు కూడా విడుదలవుతూ ఉండడంతో భారీగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే రామ్ చరణ్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే..RC -16 సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాది మార్చి కి వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది

Rc -16 సినిమాని పోస్ట్ థియేట్రికల్ స్ట్రిమింగ్ హక్కులను సైతం ప్రముఖ నిర్మాణ ఓటిటి సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన  గేమ్ ఛేంజర్ సినిమా విడుదలై ఫ్లాప్ గా మిగిలిపోయింది సుమారుగా ఈ సినిమాకి 120 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు దిల్ రాజు కూడా తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ శంకర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన సంగీతాన్ని థమన్  అందించిన  ఆకట్టుకోలేకపోయింది.. మరి ఏడాది ఆర్సి 16 తో ప్రేక్షకులను ఆనందపరుస్తారనుకుంటే వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యేవిధంగా ఉన్నట్లు ఇండస్ట్రీలు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: