
అనుకోని వివాదంలో బాలయ్య నరసింహనాయుడు ప్రొడ్యూసర్ .. గట్టిగా ఇరుక్కున్నాడుగా..?
అయితే ఇప్పుడు తాజాగా క్రాంతి తన పొలానికి కంచ వేసుకునే ప్రయత్నం చేయగా మురళీకృష్ణ అనుచరులు దాన్ని అడ్డుకున్నారని ఆరోపణలు బయటికి వచ్చాయి .. అయితే ఇప్పుడు ఈ ఘటనలో క్రాంతి పై దాడి జరిగినట్టు కూడా తెలుస్తుంది . అదే విధంగా కాంతి ఆరోపణ ప్రకారం మురళీకృష్ణ అనుచరులు తన చేతులు కట్టేసి తనపై దాడి చేశారట . ఈ దాడిలో గాయపడిన క్రాంతి ప్రస్తుతం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు .
ఆ భూమి అమ్మితే మురళి కృష్ణకే అమ్మలి లేకపోతే చంపేస్తామని అతని బెదిరించినట్లు కూడా తెలిపాడు .. ఈ బెదిరింపుల తో పాటు దాడి జరగటంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని క్రాంతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు .. ఈ దాడి అనంతరం క్రాంతి స్థానిక పోలీస్ స్టేషన్లో మురళీకృష్ణ మరియు ఆయన అనుచరులపై కంప్లైంట్ కూడా ఇచ్చాడు .. ఈ దాడి బెదిరింపులకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఈ విషయంపై మురళీకృష్ణ లేదా ఆయన బృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారక స్పందన బయటకు రాలేదు .. ప్రస్తుతానికి ఈ వివాదం సంగారెడ్డి జిల్లాలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది . రాబోయే రోజుల్లో ఈ కేసు అలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .