
నాగ్ అశ్విన్: చేసింది మూడు సినిమాలే .. కానీ తానేంటో చూపించాడుగా..!
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు నాగ్ అశ్విన్ .. నాని , విజయ్ దేవరకొండ కలిసిన నటించారు. ఇదో హ్యూమన్ ఎమోషన్ మూవీ ..
నాగ్ అశ్విన్‌లో ఉన్న సునీతత్వం మనిషిని చూసే కోణం ఎలాంటిదో చెప్పిన సినిమా . అలాగే టాలీవుడ్ కి ఓ సెన్సిబుల్ డైరెక్టర్ వచ్చాడన్న నమ్మకాన్ని కూడా కలిగించిన మూవీ . ఇక తర్వాత మహానటి అదో అద్భుతం అంతే . బయోపిక్ ఎలా తీయాలో చిత్ర పరిశ్రమకు నేర్పించాడు .. అలాగే ఈ సినిమాలో క్యారెక్టర్ ని ఎంచుకున్న విధానం దగ్గర్నుంచి , ఆ డ్రామా పండించే పద్ధతి వరకు ప్రతి చోటా ప్రతి విషయంలోనూ 100 కి 100% మార్కులు తెచ్చుకున్నాడు .. అలాగే టాలీవుడ్ చిత్ర సీమ ఎప్పటికి గర్వించుదక సినిమా తీయగలిగాడు .. అలాగే ఆ సినిమా కోసం దర్శకుడుగా నాగ్ అశ్విన్ చేసిన రీసెర్చ్ వర్క్ అంతా ఇంతా కాదు .. ఓపిక , ప్లానింగ్ గొప్ప ఫలితాన్ని తెచ్చిపెట్టాయి . సాధారణంగా ఓ బయోపిక్ తీయాలంటే అది పూర్తయి బయటకు వచ్చేటప్పటికి ఎన్నో విమర్శలు , వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .. కానీ ఎలాంటి చిన్న లోపం లేకుండా ఎవరితోనూ ఒక మాట అనిపించుకోకుండా మహానటిని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చి ఈ సినిమాతో తానేంటో చూపించాడు.
ఈ సినిమా తర్వాత కల్కి మరో రూట్ .. ఇలాంటి స్టోరీని ఎంచుకోవట పెద్ద సాహసం .. ప్రభాస్ , అమితాబ్ , కమల్ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారంటే అదంతా నాగ్ అశ్విన్ పై ఉన్న విశ్వాసమే . ఇక కల్కితో తెలుగు సినిమా మరింత పైకి ఎదిగింది .. తన విజన్ ఇంటర్సిటీ ఏంటో తెలిసి వచ్చింది .. ప్రధానంగా అన్నిటికంటే వైజయంతి మూవీస్ తన గత వైభవాన్ని తిరిగి తెచ్చుకుంది .. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సంస్థ వైజయంతి .. ఇక ఈ సంస్థకు సరైన సమయంలో గట్టి స్తంభంగా నిలిచాడు నాగ్ అశ్విన్.ఇప్పుడు తన దృష్టి మొత్తం కల్కి 2 పైనే ఉంది .. కల్కి కంటే గొప్ప సినిమాను తీయాలని దుడ సంకల్పం ఆయనలో కనిపిస్తుంది . కల్కి 2తో పాటు మరిన్ని కొత్త కథలు అందించాలనేది ఆయన లక్ష్యం .. నాగ్ అశ్విన్. ఇప్పటి దర్శకుల్ల 30 , 40 సినిమాలు చేయలేకపోవచ్చు కానీ మూడేళ్లకు ఒక సినిమా పదేళ్లకు మూడు సినిమాలు అంటూ నత్త నటికన సినిమాలు చేయచ్చు కానీ తన దగ్గర నుంచి ఎప్పుడు ఓ సినిమా వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది .. ఇందులో ఎలాంటి సందేహం లేదు .. ఎందుకంటే అక్కడ నాగ్ అశ్విన్ కాబట్టి .. అతను సంపాదించుకున్న నమ్మకం అలాంటిది.