"చిరు" చేసిన చిన్న మిస్టేక్ వల్ల "నాగ్"కి సూపర్ హిట్ వచ్చిన విషయం మీకు తెలుసా..?

frame "చిరు" చేసిన చిన్న మిస్టేక్ వల్ల "నాగ్"కి సూపర్ హిట్ వచ్చిన విషయం మీకు తెలుసా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఒకరు చేసిన మిస్టేక్ వల్ల మరొకరికి అద్భుతమైన విజయాలు దక్కిన సందర్భాలు కూడా ఉంటాయి. అవి ఎలా అనుకుంటున్నారా ..? ఒక హీరో దగ్గరకు ఒక కథ వచ్చినప్పుడు దానిని కొన్ని సందర్భాలలో ఆ హీరో రిజెక్ట్ చేయడం , ఆ తర్వాత ఆ దర్శకుడు వేరే హీరోతో ఆ సినిమాను చేయడం , ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లయితే ఆ హీరో చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఒక అద్భుతమైన సినిమాను మిస్ చేసుకున్నట్లే అవుతుంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక చిరంజీవి ఒక సినిమాను రిజెక్ట్ చేయగా అదే కథను నాగార్జున హీరో గా రూపొందించగా ఆ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుందట. ఆ సినిమా ఏది ..? అసలు చిరంజీవి ఎందుకు ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆఖరి పోరాటం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అశ్వినీ దత్ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ని మొదట రాఘవేందర్రావు , చిరంజీవితో చేయాలి అనుకున్నాడట. నిర్మాత అశ్విని దత్ కూడా అందుకు ఓకే చెప్పాడట. అందులో భాగంగా ఆయనకు కథను వినిపించగా చిరంజీవి కూడా ఓకే చెప్పాడట. ఇక దానితో శ్రీదేవిని హీరోయిన్గా కూడా అనుకున్నారట. అశ్వినీ దత్ అంతా ఓకే చేసే సినిమాలు మొదలు పెడదాం అనుకునే సమయానికి చిరంజీవి వేరే సినిమాలకు కమిట్ అయి ఉండడంతో నేను ప్రస్తుతం ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో ఆ మూవీ బృందం చిరంజీవి స్థానంలో నాగార్జునను తీసుకొని ఆఖరి పోరాటం అనే టైటిల్ తో మూవీ ని రూపొందించిందట. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో నాగార్జునకు మంచి విజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: