
రాజమౌళితో సినిమా కోసం మహేష్ ఫాలో అవుతున్న డైట్ ఇదే.. వామ్మో ఏకంగా 6 లీటర్లా..?
సినిమాకి సంబంధించిన ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండానే సినిమాకి ఇంత పబ్లిసిటీ తీసుకువచ్చే రేంజ్ రాజమౌళి ది అని తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎస్ఎస్ రాజమౌళి పేరుకున్న వాల్యూ అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు మహేష్ బాబు లుక్స్ మహేష్ బాబు ఫిజిక్.. కట్ అవుట్ బాగా వైరల్ గా మారాయి . అసలు మహేష్ బాబుని ఈ రేంజ్ లో చూస్తాము అంటూ ఎప్పుడు కూడా ఘట్టమనేని ఫ్యాన్స్ అనుకోలేక పోయారు. ఆ రేంజ్ లో మహేష్ బాబుని పూర్తిగా మార్చేసాడు రాజమౌళి .
అయితే ఆయన ఫాలో అయ్యే డైట్ ఏంటి అనేది వైరల్ గా మారింది . పూర్తిగా రాజమౌళి చెప్పిన డైట్ ని ఫాలో అవుతున్నాడట మహేష్ బాబు . మరీ ముఖ్యంగా ఇంతకుముందు కూడా మహేష్ బాబు డైటింగ్ ఫాలో అయ్యేవాడు . కానీ ఇప్పుడు మాత్రం రాజమౌళి చెప్పిన విధంగానే ఫాలో అవుతున్నారట . ఉదయాన్నే నాలుగు గంటలకు లేవాలి .. రెండు గంటలపాటు జిమ్ లేదా యోగ లేదా వాకింగ్ చేయాలి . అంతేకాదు పొద్దున్నే రెండు లీటర్ల నీళ్లు పడగడుపున తాగాలి . అంతేకాకుండా ఆయన ఫేస్ కి సంబంధించిన కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ చెప్పారట . అంతేకాదు మొలకెత్తిన గింజలు .. నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తో పాటు కచ్చితంగా ఒక గ్లాసు రాగి జావ తాగాల్సిందే.
అంతే కాదు ఆఫ్టర్నూన్ లంచ్ కి మొత్తం కార్బోహైడ్రేట్ ..హెల్దీ ఫ్యాట్ కలగలిపే ఒక స్పెషల్ డైట్ ని రాశారట . రాగి సంగటి నాన్ వెజ్ తో పాటు పన్నీర్ కూడా కచ్చితంగా తీసుకునే విధంగా డైట్ లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేశారట . మరీ ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసెస్ ప్రతి గంటకు ఒక ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒక విధంగా మహేష్ బాబు తీసుకునే విధంగా కండిషన్ పెట్టారట . అంతేకాదు రోజుకి 6 లీటర్ల కొబ్బరి నీళ్లు తాగే విధంగా రాజమౌళి - మహేష్ బాబుకు కండిషన్ పెట్టారట. నైట్ అయితే జీరో ఫుడ్ . ఓన్లీ లిక్విడ్స్ సలాడ్ తోనే మహేష్ బాబు డిన్నర్ కంప్లీట్ అవ్వాలి. కేవలం ఇది ఒక్క సంవత్సరమే కాదు రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యేవరకు మహేష్ బాబు ఇదే డైట్ ఫాలో అవ్వాలట . అందుకే ఆయనను అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు అంటున్నారు అభిమానులు, కొంతమంది ఇలాంటి కఠిన డైట్ అవసరమా బ్రో అంటూ కూడా రాజమౌళి పై సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు..!