
SSMB -29: మహేష్ ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ చెప్పిన స్టార్ హీరో..!
అయితే ఈ ఊహాగానాలన్నీ కూడా పృధ్విరాజ్ సుకుమారన్ పరోక్షంగా తిప్పికొట్టినప్పటికీ.. మళ్లీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మహేష్, రాజమౌళి చిత్రంలో తాను ఒక ఏడాదికి పైగా కొనసాగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ పనుల నుంచి తాను బాగామయ్యానని అయితే కొన్ని నిబంధనల వల్ల ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి విషయం కూడా బయట చెప్పలేదని తెలియజేశారు.. కానీ ఎప్పుడైతే ఒరిస్సాలోని కోరాపుట్ వద్ద జరిగిన షూటింగ్లో భాగంగా మహేష్ తో కలిసి తాను ఉన్న ఫోటోలు వీడియోలు బయటికి రావడంతో ఇక దాచిపెట్టడం అనవసరం అనిపించింది అంటూ తెలియజేశారు పృథ్వీరాజ్. అందుకే అన్ని విషయాలు తెలిసిపోయాయని తెలిపారు.
అయితే త్వరలోనే రాజమౌళి, మహేష్ బాబు తో కలిసి తాను కూడా మీడియా ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికైతే షూటింగ్ జరుగుతోందని అలాగే హీరోయిన్ గా ప్రియాంక చోప్రా కూడా ఈ చిత్రంలో భాగమైందని తెలియజేశారు. మొత్తానికి SSMB -29 సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి కికేక్కించే న్యూస్ అయితే తెలియజేశారు పృథ్వీరాజ్ సుకుమారం. మరి రాబోయే రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాలను తెలియజేస్తారన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం లూసిఫర్ సీక్వెల్ ని మోహన్ లాల్ తో తెరకెక్కించగా ఈ సినిమా ఈనెల విడుదల కాబోతోంది.