గత కొద్దిరోజుల నుండి మంచు మోహన్ బాబు ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ గొడవలు పక్కన పెడితే సౌందర్య ఆస్తి కాజేసారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. జల్ పల్లిలో ఆయన ఉండే మంచు టౌన్షిప్ సౌందర్య ఆస్తేనని,సౌందర్య మరణించాక సౌందర్య ఫామ్హౌస్ ని మోహన్ బాబు కబ్జా చేశారంటూ వార్తలు వినిపించాయి.ఇక రీసెంట్ గా ఓ వ్యక్తి అయితే ఏకంగా సౌందర్య చనిపోవడానికి కారణం మోహన్ బాబేనని, మోహన్ బాబు ప్లాన్ చేసి మరీ ఎక్కడా సాక్ష్యాలు బయటపడకుండా సౌందర్యని చంపించి ఆమె ఆస్తులు లాక్కున్నారంటూ ఇలా ఎన్నో వివాదాలు తలెత్తిన సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా మోహన్ బాబు సౌందర్యల ఆస్తి వివాదాల గురించి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు.. మోహన్ బాబు సౌందర్య ఆస్తి కాజేసారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ముఖ్యంగా సౌందర్య చనిపోయే వరకు కూడా మోహన్ బాబుతో మంచి స్నేహాన్నే కంటిన్యూ చేసింది. పెళ్లయ్యాక వీరి స్నేహం కంటిన్యూ అయింది.స్వయంగా సౌందర్య భర్త వచ్చి మోహన్ బాబు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పాక ఇలాంటి రూమర్లు ఏంటో అర్థం అవ్వడం లేదు.సౌందర్య ల్యాండ్ కబ్జా చేయాలని చూసింది మోహన్ బాబు కాదు.. సౌందర్యకి హైటెక్ సిటీలో కొన్ని ల్యాండ్స్ ఉన్న సంగతి నిజమే.కానీ మోహన్ బాబు అవి లాక్కోలేదు.
కొంతమంది రౌడీలు సౌందర్య ఫ్లాట్లు కబ్జా చేస్తే స్వయంగా పరిటాల రవి,మోహన్ బాబు రంగంలోకి దిగి ఆ రౌడీలకు బుద్ధి చెప్పి సౌందర్యకు ఆ స్థలాన్ని అప్పగించారు. మొహన్ బాబు సౌందర్యకు సహాయం చేశారు తప్ప అన్యాయం చేయలేదు. మోహన్ బాబు ఆస్తులు ఆయన సొంతంగా సంపాదించుకున్నవి. ఇండస్ట్రీలో ఇన్ని రోజులుగా ఉంటున్నాను ఆయన ఎలాంటి వారో మాకు తెలుసు. ఆయనపై లేనిపోని రూమర్లు పుట్టించడం తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ సౌందర్య ఆస్తిని మోహన్ బాబు కాజేసారు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నట్టి కుమార్.