RC16 టైటిల్ లాక్.. ముహూర్తం ఫిక్స్ చేసేశారుగా... !

frame RC16 టైటిల్ లాక్.. ముహూర్తం ఫిక్స్ చేసేశారుగా... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమా త‌ర్వాత ఒక్క సారిగా నేష‌న‌ల్ వైడ్ గా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. త్రిబుల్ ఆర్ దెబ్బ కు రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లి పోయింది. ఈ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో చేసిన మ‌రో భారీ పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజ‌ర్ . దిల్ రాజు బ్యాన‌ర్లో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి చ‌ర‌ణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.

త్రిబుల్ ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ కు వ‌రుస‌గా ఆచార్య - గేమ్ ఛేంజ‌ర్ రూపంలో రెండు పెద్ద డిజాస్ట‌ర్లు ప‌ల‌క‌రించాయి. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ త‌ర్వాత సినిమా ను క‌సితో చేస్తున్నాడు. చ‌ర‌ణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ సినిమా గురించి అంద‌రికి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా లెవెల్లో
తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ఏం పెడ‌తారు ? అన్న‌ది ముందు నుంచి స‌స్పెన్స్ గానే ఉంది.

ఈ సినిమా అనుకుంటున్న సమయం నుంచే పెద్ది అనే టైటిల్ వినిపించింది. ఈ టైటిల్ విష‌యంలో అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఫ్యాన్స్ లోనూ ఏ మాత్రం రెస్సాన్స్ లేదు. అయితే మేక‌ర్స్ ఫైన‌ల్ గా అదే టైటిల్ లాక్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ టైటిల్ టీజర్ ని ఈ మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: