RC 16 : పనులు ఫుల్ స్పీడ్.. కానీ నో అప్డేట్.. సూపర్ ప్లాన్ వేసిన మేకర్స్..?

frame RC 16 : పనులు ఫుల్ స్పీడ్.. కానీ నో అప్డేట్.. సూపర్ ప్లాన్ వేసిన మేకర్స్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా చరణ్ కెరియర్లో 16 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడుగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... జగపతి బాబు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు అవుతున్న ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందే బుచ్చిబాబు ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకోవడంతో ఈ మూవీ షూటింగ్ ఏ మాత్రం డిలే కాకుండా జెట్ జడ్ గా కంప్లీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా నుండి టీజర్ను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు. ఇప్పటి వరకు ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయలేదు. కానీ ప్రస్తుతం ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: