అవకాశాన్ని కోల్పోయా .. అంటూ మంచు మనోజ్ ఆసక్తికరమైన పోస్ట్..!

frame అవకాశాన్ని కోల్పోయా .. అంటూ మంచు మనోజ్ ఆసక్తికరమైన పోస్ట్..!

Divya
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు ఈరోజు కావడం చేత సోషల్ మీడియాలో అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున తన తండ్రి సినిమాలలో నటించిన జ్ఞాపకాలను సైతం మనోజ్ గుర్తు చేసుకుంటూ ఒక వీడియోని పంచుకోవడం జరిగింది.. ఈ వీడియోలో నా సూర్యుడివి చంద్రుడివి నా దేవుడివి నువ్వే నాన్న అంటూ యానిమల్ సాంగ్ తో తన తండ్రి ప్రేమను సైతం చాటుకోవడం జరిగింది మనోజ్.

అలాగే ఇలా కొటేషన్ రాసుకు వస్తు.. హ్యాపీ బర్తడే నాన్న ఈరోజు మేమంతా కూడా నీ పక్కనే ఉండి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం కానీ మిస్ అవుతున్నామని నీ వెంట నడిచేందుకు చాలా ఆసక్తిగా వేచి ఉన్నాను నీతో ప్రతి క్షణాలలో ఉండే అవకాశాలను కోల్పోయాము అంటూ లవ్ యు నాన్న అంటూ మనోజ్ ఒక పోస్ట్ చేయగా.. ఈ పోస్ట్ కి మంచు లక్ష్మి లైక్ కొట్టి వైరల్ చేస్తోంది. దీంతో అభిమానుల సైతం తండ్రి పైన తమ ప్రేమను మరొకసారి చాటుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

త్వరలోనే మంచు కుటుంబంలోని గొడవలు కూడా సర్దుమునగాలని కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మంచు కుటుంబంలో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి నివాసం వద్ద మొదలైన ఈ వివాదం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు పాకిపోయింది.. ముఖ్యంగా మనోజ్ విష్ణు మధ్య మొదలైన ఈ గొడవ పలు రకాల వివాదాలకు కారణంగా మారింది. దీంతో ఒకరి పైన మరొకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు. మోహన్ బాబు తన కుమారుడు నటిస్తున్న కన్నప్ప సినిమాలో నటించారు. ఈ సినిమా మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: