నీకు పిల్లనివ్వనంటూ సల్మాన్ ఖాన్ ని అవమానించిన హీరోయిన్ తండ్రి..?

frame నీకు పిల్లనివ్వనంటూ సల్మాన్ ఖాన్ ని అవమానించిన హీరోయిన్ తండ్రి..?

Pandrala Sravanthi
 బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 60 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా కూడా పెళ్లి చేసుకోవడం లేదు.అయితే ఈయన పెళ్లి వార్తలు ఎప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఈయన పెళ్లి కోసం ఎంతోమంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన లేనట్లుగా ఉంటున్నారు. అయితే చాలాసార్లు సల్మాన్ ఖాన్ పెళ్లి చెడిపోయింది. కొన్నిసార్లు ప్రేమించిన హీరోయిన్లతో పెళ్లి వరకు వెళ్లినప్పటికీ అది చెడిపోయింది. అయితే ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని సల్మాన్ ఖాన్ ఇంటి వరకు వెళ్లారట. కానీ ఆ హీరోయిన్ తండ్రి మాత్రం నీకు పిల్లనిచ్చేది లేదు అంటూ మొహం మీదే చెప్పేశారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..సల్మాన్ ఖాన్ అంతలా ఇష్టపడితే ఎందుకు ఆ హీరోయిన్ తండ్రి కాదన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

సల్మాన్ ఖాన్ ప్రేమించింది ఎవరినో కాదు జుహీ చావ్లా.. ఇండియాలో ఉన్న హీరోయిన్లలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ జుహీ చావ్లా. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని సల్మాన్ ఖాన్ ఎంతలానో ప్రేమించారట. సల్మాన్ ఖాన్ జుహీ చావ్లా కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. దాంతో జుహీ చావ్లా మీద ప్రేమ పెంచుకున్న సల్మాన్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగారట.

కానీ జుహీ చావ్లా మాత్రం పెళ్లి విషయంలో నిర్ణయం అంతా మా నాన్నదే అని చెప్పడంతో చేసేదేమీ లేక సల్మాన్ ఖాన్ జుహీ చావ్లా తండ్రిని మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగారట. కానీ జుహీ చావ్లా తండ్రి మాత్రం నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేను అని మొహం మీదే చెప్పేశారట.దాంతో వీరి బంధం అర్ధాంతరంగా ముగిసింది. లేకపోతే సల్మాన్ ఖాన్ అప్పుడే ఓ ఇంటివాడయ్యేవాడు. ఇక జూహి చావ్లా ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికి సింగిల్ గానే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: