
ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుందని బాత్రూంకి వెళ్లి ఏడ్చిన దీపిక పదుకొనే తండ్రి.?
ఈ హీరోయిన్ కి అప్పట్లో చాలామంది యూత్ ఫిదా అయ్యారు. అలా అందరికీ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. అయితే అలాంటి మాధురి దీక్షిత్ అంటే దీపిక పదుకొనే తండ్రి ప్రకాష్ పదుకొనే కి కూడా చాలా ఇష్టమట. ఆమె మీద పిచ్చి అభిమానం పెంచుకున్నారట. అయితే మాధురి దీక్షిత్ శ్రీరామ్ నేనే అనే డాక్టర్ని పెళ్లి చేసుకుంటుంది అని ఆమె పెళ్లి వార్తలు మీడియాలో వినిపించడంతోనే షాక్ అయిపోయిన దీపిక పదుకొనే తండ్రి వెంటనే బాత్రూం లోకి వెళ్లి ఏడ్చారట.ఆ తర్వాత బాత్రూం నుండి బయటకు వచ్చిన సమయంలో ఆయన కళ్ళు ఎర్రబడి ఉబ్బుపోయి కనిపించాయట.ఇక ఈ విషయాన్ని దీపిక పదుకొనే తల్లి ప్రతిసారి ఇంట్లో గుర్తు చేస్తూ నవ్విస్తుందట.
అయితే ఈ విషయాన్ని స్వయంగా దీపిక పదుకొనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మా నాన్నకి మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టం.ఆ హీరోయిన్ పెళ్లయిన సమయంలో మా నాన్న చాలా ఏడ్చారు. ఆయన కళ్ళు ఇలా ఉబ్బిపోయాయి అంటూ చెప్పింది. అంతే కాదు తన తండ్రి మాధురి దీక్షిత్ పెళ్లి అయిన సమయంలో ఎలా ప్రవర్తించాడో అలా చేసి చూపెట్టింది. ఇక ఇదే విషయాన్ని మాధురి దీక్షిత్ ముందు కూడా చెప్పి దీపిక పదుకొనే నవ్వుకుందట. అయితే మాధురి దీక్షిత్ పెళ్లియినప్పటికీ దీపిక పదుకొనే తండ్రికి ఆమె మీద ఉన్న అభిమానం తగ్గలేదట.ఇప్పటికి కూడా ఆమె సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అవుతారట.