నిద్ర లేవగానే బాలయ్య ఏం చేస్తాడో తెలుసా.. టాలీవుడ్ లో అలాంటి అలవాటు ఉన్న ఏకైక హీరో..!

frame నిద్ర లేవగానే బాలయ్య ఏం చేస్తాడో తెలుసా.. టాలీవుడ్ లో అలాంటి అలవాటు ఉన్న ఏకైక హీరో..!

Amruth kumar
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు నటవారసుడిగా బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాతమ్మకల సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ఇప్పటికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా 50 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తిచేసిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు బాలయ్య. ఓ ప‌క్క హీరోగా నటిస్తూనే.. మరో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తో ఎంతోమందికి వైద్యాన్ని అందిస్తు, ఇంకో ప‌క్క మంచి పొలిటీష‌య‌న్‌గాను తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య సేవలకు మెచ్చి ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును కూడా అందించింది.

 
ఇక ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల అందరికంటే ముందు అందులో దూసుకుపోతున్నాడు బాలయ్య. తాజాగా డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టి.. నాలుగు సినిమాలతో వరుస సక్సెస్ లో అందుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాల విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతూన్నాయి. ఇక ఆయన పర్సనల్ లైఫ్ లో ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంద‌ని.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి అలవాటు ఉన్న ఏకైక హీరో కూడా బాలయ్య అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. బాలయ్య షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. షూట్ నుంచి ఎంత లేటుగా ఇంటికి వచ్చినా.. ప్రతిరోజు ఉదయం మాత్రం కచ్చితంగా 3:30 నిద్రలేస్తాడు.

 
ఇది బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాడట. నిద్రలేచిన వెంటనే బాలయ్య ముందుగా భూమాతకు నమస్కారం పెట్టి.. తర్వాత స్నానం చేసి సూర్యోదయంలో పూజ చేసుకుని.. తర్వాత డైలీ రొటీన్ ప్రారంభిస్తాడట. అంతేకాదు ఉదయాన్నే ఒక చుట్ట‌ కూడా బాలయ్య కాలుస్తాడట. ఇక బాలయ్యకు దైవభక్తి ఎక్క‌వ‌. ఈ క్రమంలోనే.. దైవం కోసం సమయానికి కేటాయిస్తే మనకోసం మనం కేటాయించుకున్నట్లు ఆయన ఫీల్ అవుతారట. అందుకే ప్రతిరోజు బాలయ్య సూర్య దయానికి ముందే పూజ చేస్తాడు. అలాగే బాలయ్యకు తెలుగు మరియు సంస్కృతం పద్యాల పై కూడా మంచిపట్టు ఉంది. వాటికోసం చిన్నతనంలోనే ఆయన తన సాన్‌స్క్రిట్ మాస్టర్ దగ్గర స్పెషల్ శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే బాలయ్య ముహూర్తాలు పెట్టడంలో కూడా మంచి దిట అని.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రతిభ ఉన్న ఏకైక హీరో బాలకృష్ణ అంటూ వార్తలువైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: