విజయశాంతి కొడుకుని చూశారా..?
ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా, సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ ను అద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా సమాచారం అందుతుంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
కాగా, కళ్యాణ్ రామ్ తాజాగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. సీనియర్ నటి విజయశాంతి గారిని నేను అమ్మ అనే పిలుస్తానని నందమూరి కళ్యాణ్ రామ్ తెలియజేశారు. "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" సినిమాలో విజయశాంతి గారితో కలిసి నటించడం వల్ల మా మధ్య అనుబంధం బాగా పెరిగిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఈ సినిమాలో తల్లి కొడుకులు విడిపోవడానికి గల కారణం ఏంటి? మళ్లీ ఇద్దరూ ఎలా కలిశారు? అనేదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అని కళ్యాణ్ రామ్ అన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో విజయశాంతి నటన ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని కళ్యాణ్ రామ్ చెప్పాడు. పోరాట సన్నివేశాలలోనూ విజయశాంతి అద్భుతంగా నటించారని కళ్యాణ్ రామ్ మెచ్చుకున్నాడు. కాగా, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా టీజర్ రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ కానుంది. దీంతో నందమూరి అభిమానులు ఈ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.