అఖండ 2 సినిమా మొత్తానికి హైలెట్ సీన్ ఇదే... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
నంద‌మూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ’ అఖండ ’  సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. ఆ మాట‌కు వ‌స్తే బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్లో వ‌చ్చిన మూడు సినిమాలు కూడా ఒక దానిని మించి మ‌రొక‌టి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. సింహా - లెజెండ్ - అఖండ హ్యాట్రిక్ కొట్టాయి. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న అఖండ 2 - తాండ‌వం సినిమా మీద అంచ‌నాలు అయితే స్కై రేంజ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఇంట్రో సీన్ అదిరిపోతుందట‌.

బాల‌య్య ఇప్ప‌టికే ’ అఖండ ’ సినిమా లో అఘోరా గా న‌టించారు. ఇప్పుడు ఈ అఘోరా పాత్ర‌కు కంటిన్యుటి ఉంటుంద‌ట‌. ఇక ’ అఖండ 2 ’ తాండ‌వం సినిమాలో హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ బాల‌య్య‌ పాత్ర రివీల్ అవుతుందని స‌మాచారం. బాల‌య్య ఎంట్రీ టైంలో వ‌చ్చే విజువ‌ల్స్ అయితే కేక పెట్టించేస్తాయ‌ట‌. ఈ సినిమా మొత్తంలోనే ఈ ఇంట్రో సీన్ మెయిన్ హైలైట్ అవుతుందని టాక్ అయితే ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఇక ప్రస్తుతం హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్ర పై ఈ సన్నివేశాలను తెర‌కెక్కించే ప‌నిలో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి తో పాటు ఆయ‌న టీం బిజీగా ఉంది. ఇక అఖండ 2 తాండ‌వం సినిమా ను  14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట - గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఎస్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే ద‌స‌రా కానుక‌గా ఈ సినిమాను థియేట‌ర్ల లోకి తీసుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: