ఏంటి సీనియర్ నటి స్నేహ నిజంగానే భయంకరమైన వ్యాధితో బాధపడుతుందా.. ఇంతకీ స్నేహ కి ఉన్న ఆ వ్యాధి ఏంటి..స్నేహ భర్త ప్రసన్న చెప్పిన దాంట్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.చాలామంది నటీనటులు ఈ మధ్యకాలంలో తమకు ఉన్న అరుదైన వ్యాధుల గురించి బయట పెడుతున్నారు. అలా స్నేహకి కూడా ఓ అరుదైన వ్యాధి ఉంది అంటూ తన భర్త ప్రసన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక స్నేహ కి ఉన్న ఆ వ్యాధి ఏంటంటే ఎక్కువగా నీట్ నెస్ ఉండాలి అని చూసుకుంటుందట. ఒకరకంగా ఓసిడి ప్రాబ్లం.OCD అనే ప్రాబ్లం ఉంటే ఏదైనా సరే నీట్ గా కనిపించాలి నీటిగా లేకపోతే వారికి తెగ చిరాకు వేస్తుంది.
అలా స్నేహకి ఓసిడి ప్రాబ్లం ఉంది అని అప్పట్లో స్నేహ ప్రసన్న కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రసన్న బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ.. స్నేహ కి ఓ సి డి అనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నాతో మూడు ఇల్లు మార్పించింది. ఇంట్లో అది బాలేదు ఇది బాలేదు ఇది నీట్ గా లేదు అది నీట్ గా లేదు అని ఎప్పుడూ సర్దుతూనే ఉంటుంది. ఆమె ఒసిడి ప్రాబ్లం వల్ల ఇప్పటికే మూడు ఇల్లు మారాం. కేవలం నన్ను మాత్రమే మార్చడం లేదు మిగతావన్నీ మార్చేస్తోంది అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు స్నేహ భర్త ప్రసన్న..
ఇక ఈ విషయం గురించి స్నేహ మాట్లాడుతూ.. నాకు ఏదైనా సరే చాలా నీట్ గా కనిపించాలి.లేకపోతే నా మనసు అస్సలు సహించదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అలా స్నేహ కి ఓసిడి ప్రాబ్లం ఉంది అంటూ బహిరంగంగానే బయటపెట్టారు. ఇక స్నేహ సినిమాల విషయానికి వస్తే.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్నేహ మంచి మంచి పాత్రలు చేస్తోంది.రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ మూవీలో స్నేహ నటించింది.అలాగే గత ఏడాది వచ్చిన విజయ్ ది గోట్ మూవీలో కూడా స్నేహ చేసింది.సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది