ఏంటి సౌందర్య కారణంగా ఆ స్టార్ హీరోయిన్ తన భర్తతో గొడవలు పెట్టుకుని విడాకులు తీసుకోవాలని అనుకుందా.. ఇంతకీ సౌందర్య చేసిన తప్పేంటి.. ఎందుకు ఆ హీరోయిన్ సౌందర్య కారణంగా విడాకుల వరకు వెళ్ళింది అనేది ఇప్పుడు చూద్దాం. సౌందర్య నటనతో ఎంతోమంది కళ్ళని కట్టిపడేసింది.ముఖ్యంగా స్క్రీన్ పై ఆమె నటిస్తే చూపు తిప్పుకోకుండా ఎంతోమంది అభిమానులు కేవలం స్క్రీన్ పై సౌందర్యని మాత్రమే చూసేవారు. ఆమె పక్కన ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా సరే వారిని అట్రాక్ట్ చేసేది మాత్రం సౌందర్య యాక్టింగే.. అలా తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించి స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయిన సౌందర్య చివరికి విమాన ప్రమాదంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సౌందర్య మరణం పై ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.
సౌందర్య ఆస్తి కొట్టేయడం కోసం మోహన్ బాబే ఈ హత్య చేయించాడు అంటూ చిట్టి బాబు అనే వ్యక్తి సంచలన విషయం బయట పెట్టారు.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని మోహన్ బాబుకి మాకు సత్సంబంధాలు ఉన్నాయి అంటూ ఈ వార్తను కొట్టి పారేశారు సౌందర్య భర్త. అయితే తాజాగా సౌందర్య గురించి మీడియాలో వైరల్ అవుతున్న.వేళ ఓ హీరోయిన్ కి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటపడింది.అదేంటంటే..సౌందర్య అంతఃపురంలో నటించిన నటనకి ఓ హీరోయిన్ చాలా ఫిదా అయిందట. అంతేకాదు ఈ అవకాశం నాకెందుకు ఇవ్వలేదు అని భర్తతో గొడవ పడిందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రమ్యకృష్ణ. ఇక అసలు విషయం ఏమిటంటే.. కృష్ణవంశీ డైరెక్షన్లో అంతఃపురం సినిమా వచ్చింది.
ఈ సినిమా చేయడానికి మొదట సౌందర్య ననో చెప్పినప్పటికీ మీకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది అని డైరెక్టర్ చెప్పడంతో ఒప్పుకుందట. అయితే ఈ సినిమాలో సౌందర్య నటన ఏవిధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.ఇక ఈ సినిమా చూశాక కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు అని గొడవలు పెట్టుకుందట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో యాంకర్. డైరెక్టర్ ని అడగగా.. గొడవ పెట్టిందని మీరే అంటున్నారు కదా ఆ విషయాన్ని రమ్యకృష్ణనే అడగండి అని అసహనం వ్యక్తం చేశారు. ఇక రమ్యకృష్ణ సౌందర్యకి ఈ పాత్ర ఇచ్చినందుకు అసూయపడి కృష్ణవంశీతో గొడవలు పెట్టుకున్నట్టు కూడా ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి