స్పిరిట్ : భారీ టార్గెట్ తో వస్తున్న ప్రభాస్..!!

frame స్పిరిట్ : భారీ టార్గెట్ తో వస్తున్న ప్రభాస్..!!

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది..
ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..

ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.. సందీప్ వంగ సినిమాల్లో హీరో పాత్రకి సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది..యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా సందీప్ హీరోల క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తాడు..ఇటీవల బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ నెక్స్ట్ ప్రభాస్ తో చేసే స్పిరిట్ మీద ఫోకస్ పెట్టాడు.. ఇప్పటికే స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాను సందీప్ వంగ చాలా తక్కువ టైం లో పూర్తి చేయాలని అనుకుంటున్నాడని సమాచారం.. సందీప్ వంగ స్పిరిట్ సినిమాని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది... 9 నెలల్లోనే సినిమా షూట్ మొత్తం పూర్తి చేసి నెల రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: