
ధియేటర్లను షేక్ చేస్తున్న సీతమ్మ వాకిట్లో మ్యానియా !
ఒక క్లాస్ సినిమాకు మాస్ సినిమాలా ప్రేక్షకులు ధియేటర్లకు రావడమే కాకుండా ఈమూవీలోని పాటలు వస్తున్నప్పుడు యూత్ డాన్స్ లు చేస్తూ ధియేటర్లలో చేసిన హంగమాకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్ గా మారాయి. ఇంటర్వెల్ ముందు చిన్నోడు పాత్ర పోషించిన మహేష్ పూల కుండీని తన్నే సన్నివేశాన్ని స్క్రీన్ పై రాగానే మహేష్ అభిమానులతో పాటు ఈసినిమాకు వచ్చిన సగటు ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చూసిన వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి 11 సంవత్సరాల క్రితం ఈసినిమా విడుదలైనప్పుడు అప్పటి యూత్ ఈసినిమాను పెద్దగా ఆదరించలేదు. దీనితో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసినిమా కోసం పడ్డ కష్టం పెద్దగా రాణించకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అతడు ఆతరువాత మహేష్ తో తీసిన ‘బ్బ్రహ్మొత్సవం’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో శ్రీకాంత్ అడ్డాలకు మరింత అవకాశాలు తగ్గిపోయాయి. లేటెస్ట్ గా రీ రిలీజ్ అయిన ఈసినిమాకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రెండు కోట్ల దాకా గ్రాస్ వచ్చింది అన్న వార్తలు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.
మహేష్ అభిమానులతో పాటు వెంకటేష్ అభిమానులు కూడ ధియేటర్లలో విపరీతంగా సంది చేస్తున్నారు. ‘సంక్రాంతకి వస్తున్నాం’ సినిమా 300 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావడం ఎంత సంచలనంగా మారిందో ఇప్పుడు రీ రిలీజ్ అయిన ఈమూవీ టాప్ సక్సస్ తో వెంకటేష్ మ్యానియా మరింత పెరిగిపోవడం ఖాయం..